Viral Video: గీజర్‌గా మారిన పొయ్యి.. ఓ వైపు వంట.. మరోవైపు వేడినీరు.. వీడియో వైరల్‌

Viral Video: కొందరు టెక్నాలజీలో ఎందులోనూ సాటిలేదన్నట్లుగా ఉంటారు. మన కళ్ల ముందే అద్భుతాలు సృష్టిస్తుంటారు. ప్రతి

Update: 2024-01-05 09:25 GMT

Viral video

Viral Video: కొందరు టెక్నాలజీలో ఎందులోనూ సాటిలేదన్నట్లుగా ఉంటారు. మన కళ్ల ముందే అద్భుతాలు సృష్టిస్తుంటారు. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక టాలెంట్‌ ఉంటుంది. అది అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది. దేనికి పనికి రాని వస్తువులతో ఉపయోగపడే వస్తువుగా తయారు చేస్తుంటారు. అలాంటి వీడియోలు కొన్ని సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌ అవుతుంటాయి. ఈ తరహా ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టిట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పొయ్యినే గీజర్‌గా మార్చేశాడు. ఓ వైపు వంట చేస్తుంటే.. మరోవైపు వేడి నీరు బయటకు వస్తుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


పొయ్యిని ఇనుప రేకులతో గీజర్ (Geyser) తరహాలో వినియోగించేందుకు గుండ్రటి ఆకారంలో తయారు చేశారు ఓ వ్యక్తి. ఇనుప రేకుల మధ్యలో కొంచెం ఖాళీ స్థలం ఉంచి.. దానికి రెండు వైపులా కుళాయి తరహాలో పైపులను ఏర్పాటు చేశారు.

పొయ్యిపై రొట్టెలను కాలుస్తుండగానే పైపుల్లో ఓ వైపు నీరు పోయగా.. మరో వైపు ఉన్న పైపు నుంచి వేడి నీరు బయటికి వస్తోంది. ఇలా ఒకే పని చేస్తూ రెండు లాభాలు పొందుతున్నారు. ఈ వినూత్నమైన పొయ్యిని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 98వేలకు పైగా వ్యూస్‌ను రాగా, లైక్‌లు, కామెంట్‌లు తెగ వస్తున్నాయి. ఎవరికి వారు నష్టనట్లుగా కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News