ఎయిమ్స్ లో చేరిన భారత ఉప రాష్ట్రపతి

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ థన్ ఖడ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఛాతీనొప్పితో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు

Update: 2025-03-09 05:47 GMT

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ థన్ ఖడ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఛాతీనొప్పితో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఎయిమ్స్ లో ఉప రాష్ట్రపతి జగదీప్ థన్ ఖడ్ కు చికిత్స కొనసాగుతుంది. ఈరోజు తెల్లవారు జామున జగదీప్ థన్ ఖడ్ ఒక్కసారిగా ఛాతీనొప్పికి గురికావడంతో వెంటనే సిబ్బంది ఎయిమ్స్ కు తరలించారు. తెల్లవారు జామున రెండు గంటలకు ఆయనను ఎయిమ్స్ కు తీసుకెళ్లారు.

ఛాతీనొప్పి రావడంతో...
అయితే వెంటనే ఆయను పరిశీలించిన వైద్యులు ఛాతీ నొప్పి కావడంతో వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు. చికిత్స ప్రారంభించారు. అయితే ఉప రాష్ట్రపతి జగదీప్ థన్ ఖడ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. కొద్ది గంటల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని చెప్పినట్లు తెలిసింది.


Tags:    

Similar News