కన్వర్ యాత్రకు పొంచి ఉన్న ఉగ్ర ముప్పు.. యాత్ర గొప్పదనం ఏమిటో తెలుసా..?
గంగానది పవిత్ర జలాన్ని సేకరించి, శివుడికి జలాభిషేకం చేసేందుకు నాలుగు కోట్ల మంది కన్వర్ యాత్రికులు ఈ ఏడాది ఉత్తరాఖండ్‌కు వస్తారని
కన్వర్ యాత్రకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. దీంతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో యాత్రకు భద్రతను కట్టుదిట్టం చేశారు. తమ రాష్ట్ర పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, కన్వర్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఉత్తరాఖండ్ పోలీసులు తెలిపారు. యాత్ర జరిగే ప్రాంతాన్ని 12 సూపర్ జోన్లు, 32 జోన్లు, 120 సెక్టార్లుగా విభజించించారు. మొత్తం పది వేల మంది పోలీసులు, ఐదు కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు, బాంబ్ స్క్వాడ్‌తో సహా యాంటీ టెర్రరిజం స్క్వాడ్, జల్ పోలీసులను మోహరిస్తున్నట్లు ఉత్తరాఖండ్ పోలీసులు పేర్కొన్నారు. 400 సీసీటీవీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ-రిషికేశ్ జాతీయ రహదారిని ఈ నెల 20 నుంచి 26 వరకు మూసివేస్తున్నారు.