కుంభమేళా పొడిగింపుపై అసలు నిజమేంటంటే?

మహా కుంభమేళాను పొడిగిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2025-02-19 03:53 GMT

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాను పొడిగిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అలాంటి ప్రచారాలను నమ్మవద్దంటూ భక్తులను కోరింది. కుంభమేళాను ఎట్టి పరిస్థితుల్లో పొడిగించేది లేదని యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. భక్తులు దీనిని గమనించాలని ప్రభుత్వం కోరింది.

సోషల్ మీడియాలో...
సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు అవాస్తవమని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 26వ తేదీన కుంభమేళా ముగియనున్నట్టు యూపీ సర్కార్ ప్రకటించింది. ముందుగా ప్రకటించినట్లే మహా కుంభమేళా ముగుస్తుందని తెలిపింది. ఇప్పటి వరకూ మహా కుంభమేళాకు యాభై ఐదు వేల మంది కోట్ల మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేశారని తెలిపింది.


Tags:    

Similar News