సోషల్ మీడియాలో వార్తలు నమ్మొద్దు
సోషల్ మీడియాలో వస్తున్న అసత్య వార్తలను నమ్మవద్దని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కోరింది
సోషల్ మీడియాలో వస్తున్న అసత్య వార్తలను నమ్మవద్దని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కోరింది. యూజీసీ పరీక్షలు రద్దయ్యాయన్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. పహల్‌గామ్ ఘటన, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో యూజీసీ పరీక్షలు రద్దయ్యాయన్న వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుండటంతో అధికారులు వాటికి వివరణ ఇచ్చారు.
పరీక్షలు రద్దు కాలేదని...
అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని, వాటిలో నిజం లేదని, ఏ పరీక్షలు రద్దు కాలేదని యూజీసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ఎక్స్‌లో పోస్టు చేసిన యూజీసీ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మకూడదని, అధికారిక వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియా ఖాతాల నుంచే సమాచారం పొందాలని సూచించింది.