మధ్య ప్రాచ్యంపై యుద్ధంపై జైశంకర్ ప్రకటన

మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధంపై కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటన చేశారు

Update: 2026-03-09 07:39 GMT

మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధంపై కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటన చేశారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నట్లు రాజ్యసభలో జైశంకర్ వెల్లడించారు. ప్రధాని మోదీ యుద్ధ పరిస్థితులపై నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు జై శంకర్ చెప్ారు. భారతీయుల భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని ఆయన భరోసా కల్పించారు. కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఉన్నారని, వారి రక్షణ కోసం అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుందని తెలిపారు.

చర్చకు అనుమతివ్వాలని...
అయితే మధ్య ప్రాచ్యంపై యుద్ధం.. దాని ప్రభావం భారత్ పై పడడటం చర్చకు అనుమతి ఇవ్వాలంటూ ప్రతిపక్ష సభ్యులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు.ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్యనే కేంద్ర మంత్రి జైశంకర్ ప్రసంగించారు. యుద్ధం ప్రభావంతో పెట్రోల్, గ్యాస్ ధరలపై సైతం దృష్టి సారించినట్లు కేంద్ర మంత్రి జైశంకర్ వెల్లడించారు.


Tags:    

Similar News