విజయ్ కు సీబీఐ మరోసారి నోటీసులు
టీవీకే అధినేత విజయ్ కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది
టీవీకే అధినేత విజయ్ కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్ ను విచారించాలని మరోసారి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో టీవీకే అభిమానులు మరణించిన సంగతి తెలిసిందే.
సీబీఐ కార్యాలయానికి...
దీనిపై విచారణను సీబీఐ చేత చేయించాలని విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ విచారణను చేపట్టింది. ఇప్పటికే టీవీకే చీఫ్ విజయ్ ను ఒకసారి సీబీఐ అధికారులు ఈ కేసులో విచారించారు. మరొకసారి విచారించేందుకు ఢిల్లీ సీబీఐకి రావాలంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో రేపు విచారణకు విజయ్ హాజరు కానున్నారు.