కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. వాహనదారులకు తీపి కబురు

మధ్య ప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిం

Update: 2026-03-09 05:27 GMT

మధ్య ప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంధన ధరలను పెంచబోమని చెప్పింది. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో అనేక దేశాల్లో ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరలను పెంచారు. అయితే క్రూడాయిల్ ధరలు ఎంత పెరిగినప్పటికీ భారత్ లో ధరలు పెంచబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

క్రూడాయిల్ ధరలు పెరిగినా...
యుద్ధం కారణంగా పెరిగిన క్రూడాయిల్ ధరల నష్టాన్ని చమురు సంస్థలే భరించాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంతే తప్ప ప్రజలపై ఎటువంటి భారం మోపవద్దని తెలిపింది. రికార్డు స్థాయిలో ముడి చమురు ధరలు పెరగడంతో స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపింది. భారీగా బ్యాంకింగ్ రంగం నష్టపోయింది. అయినా సరే దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.


Tags:    

Similar News