నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం

నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. ప్రధాన నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది

Update: 2025-05-28 05:54 GMT

నరేంద్ర మోడీ 

నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. ప్రధాన నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా దేశంలో మౌలిక సదుపాయల కల్పనతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నారని చెబుతున్నారు.

కీలక నిర్ణయాల దిశగా...
దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం రైతాంగం సమస్యలపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది. దీంతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చకు రానుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News