నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పశ్చిమాసియాలో ఘర్షణ పరిస్థితులు, భారత్‌పై ప్రభావం.. గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా అంశాలపై చర్చ జరగనుంది.
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో...
దీంతో పాటు పలు అభివృద్ధి అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో నిత్యావసరాల ధరలు పెరగడంతో పాటు గ్యాస్ సిలిండర్లు కూడా లభ్యం కాకపోవడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయి. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది.