మూడు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారం ముగిసింది.
కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసింది. ఈ నెల 9వ తేదీన పోలింగ్ జరగనుంది. మూడు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగియడంతో ఆ రాష్ట్రాల్లో మైకులు మూగబోయాయి. పోలింగ్ కు సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
చివరి రోజు హోరాహోరీ...
మూడు రాష్ట్రాల్లో ఇక ఈ నెల 8వ తేదీ వరకూ ఇంటింటి ప్రచారానికి మాత్రమే అనుమతి ఉంటుంది. అంతేతప్ప బహిరంగ సభలకు, రోడ్ షోలకు అనుమతి ఉండదు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉండగా వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసకుంటామని హెచ్చరించింది. చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నేతలు హోరాహోరీగా ప్రచారం చేశారు.