దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. సులువుగా రైలు సదుపాయం

దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2026-04-08 07:16 GMT

దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వేసవిలో ప్రత్యేకరైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.వేసవి రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రత్యేక రైళ్ల నడిపించడానికి మరికొన్ని రోజులు పొడిగించింది. కీలక మార్గాల్లో ప్రయాణ సౌకర్యం పెంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగానే ప్రయాణ ప్రణాళికలు చేసుకుని ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని ప్రయాణికులకు సూచించారు.

పొడిగించిన రైళ్లివే...
ఎస్‌ఎంవీటి బెంగళూరు–సంత్రగాచి ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 24 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. సంత్రగాచి–బెంగళూరు కాంట్ ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 26 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది. మొత్తం 3 సర్వీసులు నడుస్తాయి. బెంగళూరు కాంట్.–కలబురగి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 25 వరకు ప్రతి శనివారం నడుస్తుంది. మొత్తం 3 సర్వీసులు నడుస్తాయి. కలబురగి–బెంగళూరు కాంట్ ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 26 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది. ఎస్‌ఎంవీటి బెంగళూరు–బీదర్ఏప్రిల్ 10 నుంచి 12 వరకు, అలాగే ఏప్రిల్ 17 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం, ఆదివారం నడుస్తుంది. బీదర్–ఎస్‌ఎంవీటి బెంగళూరు కు ఏప్రిల్ 11 నుంచి 13 వరకు, అలాగే ఏప్రిల్ 18 నుంచి 27 వరకు ప్రతి శనివారం, సోమవారం నడుస్తుంది.




Tags:    

Similar News