రాత్రికి రాత్రి లక్షాధికారిగా మారిన కూలీ

మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఓ గిరిజన కార్మికుడిని అదృష్టం వరించింది

Update: 2025-07-10 08:30 GMT

అదృష్టం పడితే వెతుక్కుంటూ వస్తుంది. కష్టకపడకుండానే లక్షాధికారిగా రాత్రికి రాత్రి మారిపోతారు. అది ఏ రూపంలోనైనా జరగొచ్చు. లక్ ఉంటే తప్ప అది అందరికీ సాధ్యం కాదు. కేవలం కొందరికే అదృష్ఠం కలసి వస్తుంది. మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఓ గిరిజన కార్మికుడిని అదృష్టం వరించింది. అత్యంత విలువైన వజ్రంరోజు వారీ పనిచేసి పొట్ట నింపుకునే కార్మికుడికి లభించింది.

గనిలో పనిచేస్తుండగా...
కృష్ణ కల్యాణ్‌పుర్‌ పట్టిలోని ఓ గనిలో పనిచేస్తున్న కార్మికుడు మాధవ్‌కు తాజాగా 11.95 క్యారెట్ల వజ్రం దొరికింది. వజ్రం శుభ్రంగా ఉందని, దీని విలువ నలభై లక్షల రూపాయల పైనే ఉంటుందని వజ్రాల కార్యాలయంలోని ఓ అధికారి వెల్లడించారు. కార్మికుడు నిబంధనల ప్రకారం విలువైన రాయిని తమ కార్యాలయంలో డిపాజిట్‌ చేశాడని తెలిపారు. వజ్రాన్ని త్వరలోనే వేలం వేస్తామని, వచ్చిన సొమ్ములో 12.5 శాతం రాయల్టీ తీసి మిగిలిన మొత్తాన్ని కార్మికుడికి అందిస్తామని చెప్పారు.


Tags:    

Similar News