Uttar Pradesh : ఆలయంలో తొక్కిసలాట.. ఇద్దరు మృతి
ఉత్తర్ ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. బారాబంకీ ఆలయంలో తొక్కిసలాట జరిగి ఇద్దరు భక్తులు మరణించారు
ఉత్తర్ ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. బారాబంకీ ఆలయంలో తొక్కిసలాట జరిగి ఇద్దరు భక్తులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. బారాబంకీఆలయంలో జరిగిన తొక్కిసలాటలో కూడా ఉత్తరాఖండ్ హరిద్వార్ లోని మానసాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట తరహాలోనే విద్యుత్తు షాక్ కారణమని చెబుతున్నారు. ఆలయంలోని విద్యుత్తు తీగ తెగి పడటంతో భక్తులు భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు.
విద్యుత్తు తీగ తెగిపడటంతో...
దీంతో తొక్కిసలాట జరిగినట్లు అధికారులు తెలిపారు. శ్రావణ సోమవారం కావడంతో ఈ పురాతన ఔసానేశ్వర్ మహాదేవ్ ఆలయానికి భారీగా భక్తులు చేరుకున్నారు. గుడి ప్రాంగణంలో కోతుల వల్ల విద్యుత్తు తీగలు తెగిపడ్డాయని అధికారులు అంటున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.