ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులకు యత్నం

జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై దుండగుడు కాల్పులు జరిపాడు

Update: 2026-03-12 04:12 GMT

జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై దుండగుడు కాల్పులు జరిపాడు. జమ్మూ వెలుపల ఉన్న ఒక పెళ్లి మందిరం వద్ద బుధవారం రాత్రి తుపాకీతో వచ్చిన వ్యక్తి కాల్పులకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, జమ్మూ–కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురిందర్ చౌధరీకు ప్రమాదం తప్పింది అని అధికారులు తెలిపారు. పురాని మండీకి చెందిన కమల్ సింగ్ జమ్వాల్ అనే వ్యక్తిని భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకుని విచారణకు తరలించారు.

పెళ్లి వేడుకకు హాజరైన...
గ్రేటర్ కైలాష్ ప్రాంతంలోని ఒక పెళ్లి వేడుక నుంచి అబ్దుల్లా, చౌధరీ బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడే ఎదురుచూస్తున్న జమ్వాల్ తుపాకీతో అబ్దుల్లాపై కాల్పులకు ప్రయత్నించినట్లు అధికారులు చెప్పారు. అయితే అక్కడ ఉన్న ఇద్దరు పోలీసులు, ఒక ఇన్‌స్పెక్టర్, ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్ , వెంటనే అతన్ని పట్టుకున్నారు. ఆ సమయంలో అతను ఒకసారి కాల్పు జరిపినా, వెంటనే ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని తెలిపారు. జమ్వాల్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ నేత బి.ఎస్. చౌహాన్ కుమారుడి పెళ్లి సందర్భంగా అభినందనలు తెలిపేందుకు అబ్దుల్లా, చౌధరీ అక్కడికి వచ్చారని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News