ఇండోర్ శ్రీరామనవమి వేడుకల్లో విషాదం.. బావిలో పడి 13 మంది మృతి
స్నేహనగర్ సమీపంలోని పటేల్ నగర్ లో శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయం వద్ద మెట్లబావి పై కప్పు కూలిపోవడంతో..
indore srirama navami celebrations
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్నేహనగర్ సమీపంలోని పటేల్ నగర్ లో శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయం వద్ద మెట్లబావి పై కప్పు కూలిపోవడంతో 25 మందికి పైగా బావిలో పడిపోయారు. బావిలో పడిపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడిన వారిలో పదమూడు మంది మృతి చెందారు.
ప్రమాదం జరిగిన చాలా సేపటివరకూ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ లు ఘటనా ప్రాంతానికి చేరుకోలేదని సమాచారం. స్థానికులే బావిలో పడినవారిని శ్రమకోర్చి బయటకు తీసినట్లు తెలుస్తోంది. బావిలో పడినవారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పన్నెండు మందికి పైగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.