కొత్త సంవత్సరంలో టీవీ ప్యాకేజీలు బాదుడే బాదుడు

ద్రవ్యోల్బణం కారణంగా ఇంధన ధరలతో పాటు.. అన్ని నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. తాజాగా ఆ లిస్టులోకి టీవీ..

Update: 2022-12-21 12:43 GMT

tv channels broadcast

దేశాన్ని ద్రవ్యోల్బణం భయం వెంటాడుతోంది. ఆర్థికమాంద్యం పేరుతో.. ఇప్పటికే ప్రముఖ ఐటీ కంపెనీలు, సోషల్ మీడియా సంస్థలు తమ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయి. ఇక చిన్న, చితక సంస్థల్లో ఉద్యోగాలు చేసేవారి సంగతి చెప్పనక్కర్లేదు. ద్రవ్యోల్బణం కారణంగా ఇంధన ధరలతో పాటు.. అన్ని నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. తాజాగా ఆ లిస్టులోకి టీవీ ఛానల్స్ ప్యాకేజీలు కూడా చేరాయి. కొత్తసంవత్సరంలో టీవీ లవర్స్కి ఇది ఊహించని షాకే. మూడేళ్ల తర్వాత ప్రముఖ బ్రాడ్ కాస్టర్లు ధరలను పెంచాలని నిర్ణయించుకున్నాయి. ఈ ధరల పెంపు 2023 ఫిబ్రవరి నుండి అమల్లోకి వస్తుందట.

అలకార్టే, బౌక్వెట్ రేట్లను పెంచడం ద్వారా.. నెలవారీ టీవీ రీఛార్జ్, సబ్ స్క్రిప్షన్ ప్యాక్ ఖరీదు భారీగా పెరగనుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం.. మన దగ్గర సోనీ పిక్చర్స్, స్టార్ ఇండియా, జీ ఎంటర్ టైన్ మెంట్ సహా 42 బ్రాడ్ కాస్ట్ లున్నాయి. ఆయా ప్రసారకర్తల ఛానల్స్ చూసేందుకు నెలవారీ, రెండు లేదా ఆరునెలలు, ఒక సంవత్సరం.. ఇలా ప్లాన్ ల ప్రకారం రీఛార్జ్ చేసుకోవాలి. ఈ రీ ఛార్జ్ ల ధర రూ.10 పైసల నుంచి రూ.19 వరకూ పెంచినట్లు సమాచారం.


Tags:    

Similar News