బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు

ఈరోజు దేశంలో బంగారం ధర బాగా పెరిగింది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. పది గ్రాముల బంగారంపై రూ. 230 పెరిగింది

Update: 2022-06-24 03:07 GMT

Gold and silver price updates gold and silver price in markets

బంగారానికి భారత్ లో డిమాండ్ ఎక్కువ. సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరుగుతుంటాయి. ముఖ్యంగా బంగారాన్ని పెట్టుబడిగా చూడటం కారణంగా డిమాండ్ ఎక్కువగా ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం తమ ఇంట్లోకి తెచ్చుకోవడానికి భారతీయ మహిళలు పొదుపు కూడా చేస్తారు. ధరతో సంబంధం లేకుండా కొనుగోలు చేసే బంగారం ధరల మార్పు అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు వంటి కారణాలతో జరుగుతుంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ధరలు ఇలా.....
ఈరోజు దేశంలో బంగారం ధర బాగా పెరిగింది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. పది గ్రాముల బంగారంపై రూ. 230 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,650 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,990 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 66,200 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News