గోల్డ్ లవర్స్ కు రిలీఫ్

ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇది బంగారం కొనుగోలు చేసే వారికి ఊరట అని చెప్పుకోవాలి

Update: 2023-01-30 03:19 GMT

పసిడి ప్రియులకు ధరలు తగ్గితే కాదు. స్థిరంగా ఉన్నా చాలు ఆనందమే. ఆరోజు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతారు. భారత్ లో గోల్డ్ మార్కెట్ కు ఎటువంటి ఢోకా లేదు. బంగారం వ్యాపారం బంగారంలా సాగుతుంటుంది. దీనికి ప్రధాన కారణం భారతీయుల్లో అత్యధికంగా పసిడి ప్రియులే కావడం. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు తగ్గుతూ కొంత ఆశ్చర్యపరుస్తున్నా ఎక్కువ సార్లు ధరలు పెరుగుతూనే ఉండటాన్ని మనం గమనిస్తాం. భారత ప్రభుత్వం బంగారం దిగుమతులను కూడా తగ్గించడం, బంగారానికి ఉన్న డిమాండ్ తగ్గకపోవడంతో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. సీజన్ తో సంబంధం లేకుండా బంగారాన్ని కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు భారతీయులు.

గుడ్ న్యూస్...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇది బంగారం కొనుగోలు చేసే వారికి ఊరట అని చెప్పుకోవాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,650 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,440 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 74,200 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News