Tirumala : తిరుమలలో రష్ తగ్గలేదుగా.. మంగళవారం కూడా.. పెళ్లిళ్ల సీజన్ వల్లనేనా?
తిరుమలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మంగళవరం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. దర్శనానికి గంటల సమయం పడుతుంది.
తిరుమలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మంగళవరం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. దర్శనానికి గంటల సమయం పడుతుంది. తిరుమలకు వరస సెలవులు రావడంతో నిన్నటి వరకూ భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అయితే మంగళవారం కూడా అదే రద్దీ కొనసాగుతుంది. సాధారణంగా మంగళవారం, బుధవారం, గురువారాలు భక్తుల రద్దీ తక్కువగా ఉంటుందని, కానీ ఈ వారం మాత్రం వారంతో సంబంధం లేకుండా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. భక్తులు అధికంగా వస్తుండటంతో హుండీ ఆదాయం కూడా ఈ నెల భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతలో ఎన్నడూ లేని విధంగా ఇంతటి రద్దీ ఉందని, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులు రావడంతో పాటు శ్రావణమాసం కావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తున్నారు.