డెలివరీ బాయ్స్ గా వచ్చారు.. దోచేశారు
డెలివరీ బాయ్స్ దుస్తులతో ఓ నగల దుకాణంలోకి వచ్చి దోచేశారు.
డెలివరీ బాయ్స్ దుస్తులతో ఓ నగల దుకాణంలోకి వచ్చి దోచేశారు. ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ లో ఇద్దరు యువకులు తుపాకీతో నగల దుకాణం సిబ్బందిని బెదిరించి షాపులోని బంగారం, వెండి వస్తువులను దోచుకున్నారు. పట్టణంలోని బ్రిజ్ విహార్ ప్రాంతంలోని నగల దుకాణంలో ఈ దోపిడీ జరిగింది. ఆ సమయంలో యజమాని భోజనానికి వెళ్లగా, పనిచేసే వ్యక్తి మాత్రమే ఉన్నాడు. నగలను బ్యాగుల్లోకి సర్దుకున్నాక బైకుపై పరారయ్యారు. దోచుకొన్న నగల విలువ దాదాపు 30 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, షాపుతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.