అక్కడ రాఖీలు భర్తలకు మాత్రమే
రాఖీ పండుగ వచ్చేస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో రాఖీ పండుగను వైవిధ్యంగా జరుపుకుంటారు.
రాఖీ పండుగ వచ్చేస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో రాఖీ పండుగను వైవిధ్యంగా జరుపుకుంటారు. మధ్యప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్లో సోదరులకు రాఖీ కట్టరు తెలుసా? శతాబ్దాలుగా అక్కడి మహిళలు సోదరులకు కాకుండా భర్తలకు, చెట్లకు రాఖీ కడతారు. ఛింద్వాడా జిల్లాలోని గోండు గిరిజన సమాజంలో భర్త మాత్రమే జీవితాంతం పక్కనే ఉండి రక్షిస్తాడని నమ్ముతారు. అందుకే రాఖీ భర్తకు కడతారు. రక్షాబంధన్ రోజున పొలాల్లో పూజలు చేసి పంటలకు, అడవుల్లోని చెట్లకు కూడా రాఖీ కడతారు. వీరు సొంతంగానే రాఖీలను తయారు చేస్తారు.