జమ్మూకాశ్మీర్ లో భారీగా వరదలు

జమ్మూకాశ్మీర్ లో భారీగా వరదలు సంభవించాయి. ఒక్క సారి వరదలు రావడంతో కొండచరియలు విరిగిపడ్డాయి.

Update: 2025-04-20 06:37 GMT

జమ్మూకాశ్మీర్ లో భారీగా వరదలు సంభవించాయి. ఒక్క సారి వరదలు రావడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ముగ్గురు మరణించారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. జమ్మూకాశ్మీర్ లో తలెత్తిన వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఎక్కడ ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయిందని, వందలాది వాహనాలు రోడ్లమీదనే నిలిచాయని చెబుతున్నారు.

ట్రాఫిక్ సమస్య...
మరికొందరు కూడా ఈ వరదల్లో గాయపడినట్లు తెలిసింది. ఎంత మంది గాయపడ్డారన్నది ఇంకా తెలియరాలేదు. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. విరిగిపడిన కొండచరియలను రోడ్డు పక్కన పడేసి వాటిని పక్కకు జరిపి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇంకా వేల సంఖ్యలో వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయని చెబుతున్నారు.


Tags:    

Similar News