ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ వేడుకలు

దేశ రాజధాని ఢిల్లీలో 73వ రిపబ్లిక్ వేడుకలు ఘనంగా జరిగాయి.

Update: 2022-01-26 06:51 GMT

దేశ రాజధాని ఢిల్లీలో 73వ రిపబ్లిక్ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ వందనం చేసి గణతంత్ర వేడుకలను ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలు ప్రత్యేకంగా అలంకరించిన శకటాలను తిలకించారు. విశిష్ సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలను అందచేశారు. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్ కు చెందిన ఏఎస్ఐ బాబూరామ్ కు అశోక్ చక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు.

వాయుసేన విన్యాసాలు...
ఆయన 2020లో జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులను హతమర్చారు. ఈ అవార్డును బాబూరావు మరణం తర్వాత ప్రకటించడంతో కుటుంబ సభ్యులు అందుకున్నారు. దేశ సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పేలా పరేడ్ నిర్వహించారు. వాయుసేన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమరవీరులకు మోదీ నివాళులర్పించారు.


Tags:    

Similar News