సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. ముగ్గురు మహిళలకు విముక్తి

సెక్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ముగ్గురు మహిళలను రక్షించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.

Update: 2022-07-25 07:52 GMT

థానే: మహారాష్ట్రలోని థానే నగరంలో నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ముగ్గురు మహిళలను రక్షించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. క్షయవ్యాధితో బాధపడుతున్న తన తండ్రికి వైద్యం కోసం డబ్బు ఇస్తామని చెప్పడంతో.. తాను వ్యభిచారం చేయవలసి వచ్చిందని 22 ఏళ్ల వయస్సు గల పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళ పోలీసులకు చెప్పింది. పక్కా సమాచారం ఆధారంగా వాగ్లే ఎస్టేట్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ దగ్గరకు కస్టమర్‌ను పిలిపించగా.. పోలీసులకు సమాచారం అందింది. వ్యభిచార రాకెట్‌ నడుపుతున్న ఓ మహిళను అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.

నిందితుడైన మహిళ ఒక్కో ఖాతాదారుడి నుంచి రూ.20వేలు వసూలు చేసి అందులో నుంచి రూ.3వేలు అమ్మాయిలకు చెల్లించేవారని తెలిపారు. బాధితులు ఇక్కడి డోంబివిలీ టౌన్‌షిప్‌లో బార్ డ్యాన్సర్‌లుగా పనిచేశారని, అయితే దాని ద్వారా సంపాదించిన డబ్బు సరిపోకపోవడంతో వారు వ్యభిచారం చేస్తున్నారని అధికారి తెలిపారు. రక్షించిన మహిళలను షెల్టర్ హోంకు తరలించారు. పోలీసులు భారతీయ శిక్షాస్మృతి మరియు అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టంలోని నిబంధనల ప్రకారం నిందితులపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.


Tags:    

Similar News