వీబీ - రామ్ - జీ బిల్లును లోక్ సభలో
పార్లమెంటులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి
పార్లమెంటులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వీబీ - రామ్ - జీ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. సభ దీనిని ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును తొలగించి, మరొకపేరును పెట్టడాన్ని కాంగ్రెస్ తో పాటు మిగిలిన ఇండి పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
గందరగోళం పరిస్థితుల మధ్య...
బిల్లు ప్రతులను లోక్ సభలోనే విపక్ష సభ్యులు చించిపడేశారు. దీంతో స్పీకర్ విపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకపక్షంగా లోక్ సభలో బిల్లును ఆమోదించుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. లోక్ సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో వీబీ - రామ్ - జీ బిల్లు ఆమోదం పొందిందని ప్రకటించిన స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.