Opration Sindoor : దేశంలో 32 విమానాశ్రయాల్లో ఆంక్షలు

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ - భారత్ ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో భారత్ లో విమానాశ్రయాలను మూసివేసింది

Update: 2025-05-10 01:40 GMT

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ - భారత్ ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత విమానాశ్రయాలు, సైనిక స్థావరాలపై దాడులకు పాక్ దిగుతుంది. దీంతో భారత్ లో దాదాపు ముప్ఫయి రెండు విమానాశ్రయాలను మూసివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 15వ తేదీ వరకూ మూసి వేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రయాణికుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

మే 15 వరకూ మూసివేత...
పోర్ బందర్, లేహ్, బికనీర్, జమ్మూ, పఠాన్ కోట్, జైసల్మేర్, సిమ్లా, పాటియాలా, కిషన్ గఢ్, భుంటార్, లూథియానా, అమృత్ సర్, శ్రీనగర్, ఛండీగఢ్, జమ్మూవంటి ప్రాంతాల్లో విమానాశ్రయాలను మూసి వేసింది. ప్రధానంగా భారత సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న ఈ విమానాశ్రయాలను మూసివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక రైళ్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేసింది. రైళ్లలోనే వెళ్లిపోవాలని తెలిపింది. విమానాశ్రయాలు ఈ నెల 15వ తేదీ వరకూ తెరిచే అవకాశముండదని తెలిపింది.


Tags:    

Similar News