200 ఏళ్లలో తొలిసారి తమిళనాడులో?

తమిళనాడును భారీ వర్షాలు వీడటం లేదు. చెన్నైతో సహా రాష్ట్రంలోని అన్ని నగరాల్లోనూ కుండ పోత వర్షం కురుస్తుంది.

Update: 2021-11-28 07:44 GMT

తమిళనాడును భారీ వర్షాలు వీడటం లేదు. చెన్నైతో సహా రాష్ట్రంలోని అన్ని నగరాల్లోనూ కుండ పోత వర్షం కురుస్తుంది. దీంతో అనేక పట్టణాలు నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడులోని తూత్తుకూడి, చెంగల్ పట్టు, నాగపట్నంలోని అనేక ప్రాంతాలు నీటిలో నానుతున్నాయి. ఇప్పటికే నీట మునిగిన ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకువస్తున్నారు.

సహాయ కార్యక్రమాలు....
ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు సహాయ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఒకరోజులోనే వరదల దెబ్బకు ముగ్గురు మృతి చెందారు. 273 ఇళ్లు దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ వరద ప్రభావిత ప్రాంతాలను నేరుగా పర్యటించి బాధితులతో మాట్లాడారు. నవంబరు నెలలో తమిళనాడులో వంద మీటర్ల వర్షపాతం నమోదయిందని స్టాలిన్ తెలిపారు.200 సంవత్సరాల్లో ఇంతటి విపత్తు ఎన్నడూ సంభవించలేదన్నారు.


Tags:    

Similar News