నుపుర్ శర్మను అరెస్ట్ చేయొద్దు.. సుప్రీం ఆదేశం

మాజీ బీజేపీ నేత నుపుర్ శర్మను అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది

Update: 2022-07-19 12:44 GMT

మాజీ బీజేపీ నేత నుపుర్ శర్మను అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. తనకు ప్రాణ హాని ఉందని, తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని నుపుర్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు నుపుర్ శర్మకు ప్రాణహాని ఉన్న మాట నిజమేనని, ఆమెను అరెస్ట్ చేయవద్దని పేర్కొంది. వచ్చే నెల 10వ తేదీ వరకూ ఆమెను అరెస్ట్ చేయవద్దని, ఆమెపై ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అన్ని కేసులను ఢిల్లీకి....
అలాగే నుపుర్ శర్మపై నమోదయిన అన్ని కేసులను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆగస్టు 10వ తేదీలోగా తమ అభ్యంతరాలను తెలపాలని సుప్రీంకోర్టు కోరింది. నుపుర్ శర్మపై కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, అసోం, ఢిల్లీ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ ఢిల్లీకి బదిలీలా చేసే విషయంపై స్పందన తెలపాలని సుప్రీంకోర్టు కోరింది.


Tags:    

Similar News