Breaking : బెంగళూరులో పది మందికి చేరిన మృతుల సంఖ్య.. వైఫల్యం ఎవరిది?
stampede occurred at chinna swamy stadium in bengaluru. ten people were reported to have died in the stampede
ముందస్తు సమాచారం ఉంది. పద్దెనిమిదేళ్ల తర్వాత లభించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వస్తారని తెలుసు. కానీ ప్రభుత్వం మాత్రం ముందస్తు చర్యలు చేపట్టలేకపోయింది. పోలీసులు కూడా చేతులెత్తేశారు. ఒక్కసారిగా వచ్చిపడిన యువకులు, యువతులు, నడివయస్సు వారు ఇలా వయసుతో సంబంధం లేకుండా ఒక్కసారిగా దూసుకు వచ్చారు. గేట్ 2 వద్ద ఈ తొక్కిసలాట జరిగింది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో తొక్కిసలాట లో పది మంది మరణించినట్లు తెలిసింది. అభిమానుల రద్దీని పోలీసులు ముందుగా అంచనా వేయలేకపోవడం వల్లనే ఈ తోపులాట జరిగిందని ప్రాధమికంగా నిర్ణయానికి వచ్చారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే...
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. పది మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. దాదాపు యాభై మంది మందికి గాయాలయ్యాయి. నిన్న జరిగిన ఐపీఎల్ ఫైనల్స్ లో పంజబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. పద్దెనిమిదేళ్ల తర్వాత లభించిన విజయాన్ని ఆర్సీబీ ఫ్యాన్స్ నిన్న రాత్రి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విధాన సౌధ నుంచి చిన్న స్వామి స్టేడియానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యులు వస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పోలీసులకు ముందే తెలిసినా అభిమానులను కట్టడి చేయాల్సినసంఖ్యలో పోలీసులు లేరు.
ముందస్తు చర్యలేవీ...?
తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వేల సంఖ్యలో తరలి వస్తారని తెలిసిన ప్రభుత్వం అందుకు తగినట్లుగా చర్యలు కూడా తీసుకోలేకపోయింది. నిన్న రాత్రి మ్యాచ్ లో విజయం సాధిస్తే ఈరోజు మధ్యాహ్నం బెంగళూరుకు జట్టు చేరుకుంటుందని తెలుసు. లక్షల్లో ఫ్యాన్స్ ఉన్న ఈ జట్టును చూసేందుకు తరలి వస్తారని అంచనా వేసి కనీసం ముందు అప్రమత్తంగా తీసుకుని స్టేడియం వద్ద తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు పోలీసులను భారీగా మొహరించాలని కూడా తెలియని పరిస్థితల్లో ప్రభుత్వం ఉంది. ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చి చనిపోవడానికి గల కారణాలు ఏంటి? క్షమాపణలు చెబితే సరిపోతుందా? ఎవరిదీ పాపం? అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.