మంచు కురిసే వేళలో

మూడు నెలల విరామం తర్వాత శుక్రవారం సిమ్లాలో ఈ సీజన్‌కు తొలి మంచు కురిసింది.

Update: 2026-01-23 04:55 GMT

మూడు నెలల విరామం తర్వాత శుక్రవారం సిమ్లాలో ఈ సీజన్‌కు తొలి మంచు కురిసింది. రాష్ట్రంలోని మరో ప్రముఖ పర్యాటక కేంద్రం మనాలితో పాటు హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో కూడా మంచు పడుతోంది. భారీ మంచు, వర్ష సూచన చేసిన ఇప్పటికే వాతావరణ శాఖ చేసింది. స్థానిక వాతావరణ కేంద్రం రాబోయే రోజుల్లో భారీగా మంచు, వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఈ ప్రాంతంలోకి వెళ్లొద్దంటూ...
ఈ నేపథ్యంలో వాతావరణం చల్లబడే వరకు వాహనాలు నడపొద్దని సిమ్లా జిల్లా యంత్రాంగం ప్రజలకు సూచించింది. దీంతో చోపాల్–దేహా రహదారి మూసివేశారు. జిల్లాలోని చోపాల్‌ సహా ఎత్తైన ప్రాంతాల్లో మంచు పడుతుండటంతో చోపాల్–దేహా రహదారి మూసుకుపోయిందని అధికారులు తెలిపారు. మంచు కురుస్తుండటంతో పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశముంది.


Tags:    

Similar News