IPL 2024 : రేపు ఫైనల్స్ .. ఈసారి ఛాంపియన్ ఎవరో?

ఐపీఎల్ పదిహేడో సీజన్ రేపటితో ముగియనుంది. ఎవరు ఛాంపియన్ అనేది తేలుతుంది.

Update: 2024-05-25 03:37 GMT

ఐపీఎల్ పదిహేడో సీజన్ రేపటితో ముగియనుంది. ఎవరు ఛాంపియన్ అనేది తేలుతుంది. ఫైనల్స్ కు కోల్్కత్తా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు చేరుకున్నాయి. తొలి మ్యాచ్ లోనే కోల్ కత్తా నైట్ రైడర్స్ గెలిచి ఫైనల్స్ కు చేరుకుంది. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒక మ్యాచ్ ఓడిపోయి రెండు మ్యాచ్ లు గెలిచి చివరకు ఫైనల్స్ కు చేరుకుంది. రెండు జట్లు బలంగా కనిపిస్తున్నాయి. మంచి ఫామ్ లో ఉన్నాయి.

చెన్నైలోని మైదానంలో...
చెన్నై లోని చెపాక్ మైదానంలో రేపు 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంంది. ఈసారి కప్పు ఎవరది అన్నది తేలనుంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తొలి నుంచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మంచి ఊపుమీదుంది. ఇకమైదానంలో ఎవరిది పై చేయి అవుతుందన్నది అప్పుడే తేలనుంది. అందుకే అంచనాలు ఎప్పటికీ నిజం కావు. కేవలం లెక్కలే ఛాంపియన్ ఎవరన్నది తేలుస్తాయి. ఛాంపియన్ ఎవరు అన్నది తేలాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.


Tags:    

Similar News