నేటి నుంచి జీ20 సదస్సు.. పోలీస్ వలయంలో నగరం

సమావేశం జరగనున్న షేర్-ఏ-కశ్మీర్‌ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే మార్గాలు సహా నరం మొత్తం పోలీసులు

Update: 2023-05-22 06:35 GMT

జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో నేడు జీ20 టూరిజం సదస్సు ప్రారంభం కానుంది. ఈ జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. సమావేశం జరగనున్న షేర్-ఏ-కశ్మీర్‌ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే మార్గాలు సహా నరం మొత్తం పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా తొలగించిన తర్వాత తొలిసారి అక్కడ జరుగుతున్న అంతర్జాతీయ సమావేశం ఇదే. దాంతో పోలీసులు, అధికారయంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ సమావేశాలకు జీ20 సభ్య దేశాలకు చెందిన సుమారు 60 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

సింగపూర్ నుంచి అత్యధిక మంది ఈ సమావేశానికి రానున్నట్లు అధికారులు తెలిపారు. జమ్మూలో ఈ సమావేశాలను నిర్వహించడంపై చైనా ఇప్పటికే అభ్యంతరం తెలిపింది. టర్కీ ఈ సమావేశానికి దూరంగానే ఉండాలని నిర్ణయించింది. అంతర్జాతీయ సమావేశాలను వివాదాస్పద ప్రాంతాల్లో నిర్వహించకూడదన్న చైనా వ్యాఖ్యలపై భారత్ దీటుగా సమాధానం ఇచ్చింది. తమ భూభాగంలో ఎక్కడైనా సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు తమకుందని భారత్ తేల్చి చెప్పింది.




Tags:    

Similar News