జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతాదళాలు
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతాదళాలు ఆపరేషన్ ప్రారంభించాయి
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతాదళాలు ఆపరేషన్ ప్రారంభించాయి. కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్‌లో చొరబాటు ప్రయత్నం జరుగుతోందన్న సమాచారంపై భద్రతా దళాలు శుక్రవారం సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వస్తున్నారని గూఢచారి శాఖ నుంచి సమాచారం రావడంతో నవంబర్ 7వ తేదీన ఆర్మీ దళాలు సమన్వయంతో ఆపరేషన్‌ను ప్రారంభించాయి. తదనంతరం చర్యల్లో నిమగ్నమైన సైనికులు అనుమానాస్పద కదలికను గమనించారు.
ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో...
భద్రతాదళాలు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాంతో దళాలు ప్రతిదాడి ప్రారంభించాయి. ఉగ్రవాదులు చిక్కుకున్నారని, ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు ఇదివరకు నవంబర్ 5న కిష్త్వార్ జిల్లా ఛత్రూ ప్రాంతంలో కూడా ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీస్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టగా కాల్పులు కొనసాగుతున్నాయి.