రౌడీలు కాదు విద్యార్థులే.. బస్ స్టాప్ లో రచ్చ రచ్చ

ఇద్దరు విద్యార్థులను ఇతర విద్యార్థుల బృందం దారుణంగా కొట్టిన వీడియోను ఓ ప్రయాణీకుడు తన ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశాడు.

Update: 2022-04-28 06:38 GMT

తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని ఒండిపుదూర్‌లోని బస్టాండ్‌లో కొందరు కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోను చూసి వారెవరో వీధి రౌడీలు అని అనుకోకండి.. వారంతా పాఠశాల విద్యార్థులే..! ఒకరితో ఒకరు గొడవపడుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. తమిళనాడు రాష్ట్రంలో గతంలో కూడా స్కూల్ విద్యార్థులు చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతూ పట్టుబడిన సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. ఈ మధ్య కాలంలో అలాంటి ఘటనలు మరింత పెరుగుతున్నందున, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), శైలేంద్ర బాబు, అలాంటి పనులు విద్యార్థులు చేయకూడదని చెబుతూ ఒక వీడియోను విడుదల చేశారు.

ఇద్దరు విద్యార్థులను ఇతర విద్యార్థుల బృందం దారుణంగా కొట్టిన వీడియోను ఓ ప్రయాణీకుడు తన ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశాడు. వారి యూనిఫారామ్ లు చూడగా.. వారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులని తెలుస్తోంది. గొడవ జరగడం చూసి ప్రయాణికులు షాక్ అయ్యారు. విద్యార్థులు పలు చోట్ల గొడవపడుతున్న ఘటనలు తమిళనాడులో పెరుగుతున్నాయి. చెన్నైలోని న్యూ వాషర్‌మెన్‌పేట్‌లోని బస్టాండ్‌లో విద్యార్థుల మధ్య వాగ్వాదం, ముష్టిఘాతానికి దారితీసింది.
పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వార్నింగ్‌తో వదిలిపెట్టారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి), శైలేంద్ర బాబు, విద్యార్థులు అలాంటి పనులకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. "నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నామంటే అందుకు కారణం మన తల్లిదండ్రుల దగ్గర పెద్దగా డబ్బులు లేకపోవడమే, కానీ మనకంటూ ఉన్నవి గది, డెస్క్‌లు, కుర్చీలు మాత్రమే.. వాటిని మనం సరిగా చూసుకోవాలని, ఉపాధ్యాయులకు సరైన గౌరవం ఇవ్వాలి" అని శైలేంద్రబాబు ప్రశ్నించారు. గొడవలు మానేయాలని ఆయన విద్యార్థులకు చెప్పారు.


Tags:    

Similar News