ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. వెంకయ్యకు మరో అవకాశం

భారత ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. జులై 5 ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది.

Update: 2022-06-29 11:47 GMT

భారత ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. జులై 5 ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. జులై 19వ తేదీ వరూ నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. జులై 20న దరఖాస్తులను పరిశీలిస్తారు. దరఖాస్తుల ఉపసంహరణకు జులై 22వ తేదీగా ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు ఆరోతేదీన జరగనుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని ఎన్నికల కమిషన్ తెలిపింది.

రాజ్యసభను...
ప్రస్తుతం వెంకయ్య నాయుడు భారత ఉప రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయన స్థానంలో మరొకరిని ఎన్డీఏ ప్రభుత్వం పోటీకి దింపుతుందా? లేదా వెంకయ్య నాయుడుకి మరోసారి అవకాశం కల్పిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. అయితే రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా వెంకయ్య నాయుడికి మరోసారి అవకాశం కల్పించాలని బీజేపీ అధిష్టానం సిద్ధమయింది. ఇటీవల వెంకయ్యను కలిసిన కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉపరాష్ట్రపతిగా కొనసాగాలని కోరినట్లు తెలిసింది. రాజ్యసభను సజావుగా నడిపేందుకు మరోసారి వెంకయ్యనాయుడుకు అవకాశమిస్తారన్న టాక్ హస్తిన వర్గాల నుంచి తెలుస్తోంది.


Tags:    

Similar News