Video Viral: చపాతిలు గుండ్రంగా రావడం లేదా? ఈ అక్క ట్రిక్‌ అదిరిపోలా..! వీడియో వైరల్

ఈ రోజు సోషల్ మీడియా కేవలం వినోదం, జంతువులకు సంబంధించిన వీడియోలే కాకుండా ఉపయోగానికి వచ్చే వీడియోలు కూడా

Update: 2024-03-24 02:43 GMT

Roti Video Viral

ఈ రోజు సోషల్ మీడియా కేవలం వినోదం, జంతువులకు సంబంధించిన వీడియోలే కాకుండా ఉపయోగానికి వచ్చే వీడియోలు కూడా ట్రెండ్‌ అవుతుంటాయి. చాలా మంది ఏదైనా వంట నేర్చుకోవాలని, కొత్త ట్రిక్స్‌ తెలుసుకోవాలన్నా సోషల్‌ మీడియా, యూట్యూట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఏదీ కావాలన్నా యూట్యూబ్‌ ద్వారా తెలుసుకోవచ్చు. చాలా మంది కూడా ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు. ఇది మన జీవితాన్ని చాలా సులభతరం చేస్తుంది. ఇటీవలి కాలంలో కూడా ఇలాంటి వీడియో జనాల్లో చర్చనీయాంశమైంది. ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా షాకవుతారు. ఈ ట్రిక్‌ భలేగుందని అనుకుంటారు.

చాలా మంది రకరకాల వంటలు చేస్తుంటారు. అలాగే చాపాతి అంటే అందరికి ఇష్టమే. కొందరు చపాతి చేస్తుంటే గుండ్రంగా రావు. ఎంత ప్రయత్నించినా అడ్డదిడ్డంగానే వస్తుంటాయి. కానీ ఇక్కడ ఓ అక్క వాడిన ట్రిక్‌ను చూస్తే శభాష్‌ అనకమానరు.

కిచెన్‌లో ఉన్న ఓ మహిళ ముందుగా పిండితో పెద్ద బాల్‌ను తయారు చేసి పెద్ద ఆకారంలో రోటీని చేయడం ఈ వీడియోలో చూడవచ్చు. పిండి పెద్దది అయినప్పుడు, ఆమె ఒక రోటీ సైజు గిన్నె తీసుకొని దాని నుండి మూడు-నాలుగు రోటీ-పరిమాణ బాల్స్ కట్ చేస్తుంది. ఇది మాత్రమే కాదు, స్త్రీ ఒకే పాన్‌పై నాలుగు రోటీలను ఒకదానిపై ఒకటి ఉంచి కాల్చుతుంది. ఇది మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ ఈ పద్ధతి ఖచ్చితంగా సరైనది నెటిజన్లు చెబుతున్నారు. ఈ క్లిప్ rajput_jodi_ అనే అనే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో షేర్‌ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.



Tags:    

Similar News