పెట్రోల్ ట్యాంక్ పై కూర్చుని రొమాన్స్.. ఫైన్ ఎంత కట్టాలంటే?
నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక జంట బైక్ మీద వెళుతూ ఉంది.
నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక జంట బైక్ మీద వెళుతూ ఉంది. ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా, పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చుని ఉన్న మహిళ, హెల్మెట్ ధరించకుండా అతడిని కౌగిలించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఇద్దరినీ కారులో వెళుతున్న వారు చిత్రీకరించారు. ఆ క్లిప్ ఆన్‌లైన్‌లో వైరల్ అయింది.
అంతేకాకుండా అక్కడి సీసీటీవీ కెమెరాలలో ఈ ఉదంతమంతా రికార్డయ్యింది. ఆ వాహనం నంబరు ఆధారంగా బైక్‌ను గుర్తించి మోటారు వాహనాల చట్టంలోని సంబంధిత విభాగాల కింద 53 వేల 500 రూపాయలు చలానా జారీ చేశామని నోయిడా ట్రాఫిక్ విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లకన్ సింగ్ యాదవ్ తెలిపారు. ఈ సంఘటన సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందన్నారు. ప్రమాదకరమైన డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం తదితర నేరాల కింద మోటార్ వాహనాల చట్టంలోని వివిధ విభాగాల కింద పోలీసులు ఆ వాహనానికి చలానా జారీ చేసినట్లు తెలిపారు.