నేటి నుంచి డిజిటిల్ రూపీ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ రూపీని రిటైల్ ఉపయోగం కోసం విడుదల చేసింది

Update: 2022-12-01 08:06 GMT

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ రూపీని రిటైల్ ఉపయోగం కోసం విడుదల చేసింది. నేటి నుంచి డిజిటల్ రూపీ అమలులోకి రానుంది. ప్రయోగాత్మకంగా ఎనిమిది బ్యాంకుల్లో డిజిటల్ రూపీని అమలు చేస్తుంది. రిటైల్ ఉపయోగం కోసం ప్రయోగాత్మకంగా కొన్ని నగరాలకు పరిమితం చేసింది. బెంగళూరు, ముంబయి, న్యూఢిల్లీ, భువనేశ్వ్ నగరాల్లోనే డిజిటిల్ రూపీ రిటైల్ ఉపయోగం కోసం అమలులోకి తెచ్చింది.

కొన్ని బ్యాంకుల్లోనే...
స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీసీఐ బ్యాంకులతో పాటు మరికొన్ని బ్యాంకుల్లోనే దీనిని వినియోగించాల్సి ఉంటుంది. టోకెన్ రూపంలో ఉండే ఈ డిజిటల్ రూపాయి ప్రస్తుతం అమలులో ఉన్న కరెన్సీకి సమానంగా పనిచేస్తుందని ఆర్బీఐ తెలిపింది. డిజిటల్ రపాయి వాలెట్ సిస్టమ్ ద్వారా లావాదేవీలు జరపుకోవచ్చని పేర్కొంది. ఇది మరింత సురక్షితంగా ఉంటుందని ఆర్బీఐ అభిప్రాయపడింది.


Tags:    

Similar News