ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ వేడుకలు
ఢిల్లీలో గణతంత్ర వేడుకలను ఘనంగానిర్వహిస్తున్నారు.
ఢిల్లీలో గణతంత్ర వేడుకలను ఘనంగానిర్వహిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఢిల్లీ కర్తవ్య పథ్ లో సర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్ థీమ్ తో ఈ రిపబ్లిక్ డే వేడులకను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. జాతీయ యుద్ధ స్మారక చిహ్మంవద్ద ప్రధాని నరేంద్ర మోదీ అమరవీరులకు నివాళులర్పించారు.
మహాకుంభ్ మేళాశకటం...
ఈ రిపబ్లిక్ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియంతో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం రిపబ్లిక్ పరడే్ విజయ్ చౌక్ నుంచి ప్రారంభమై కర్తవ్యపథ్ మీదుగాఎర్రకోటకు చేరుకుంది. పరేడ్ లో ఐదువేల మంది కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. అలాగే పదిహేను శకటాలు పాల్గొన్నాయి. మహాకుంభ్ మేళా శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.