G20 సమ్మిట్ లో రామ్ చరణ్ నాటు నాటు స్టెప్.. వీడియో వైరల్
తాజాగా కశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతున్న 2023 G20 సదస్సుకు చరణ్ హాజరయ్యాడు. మే 22న మొదలైన ఈ సదస్సు మూడురోజుల పాటు..
natu natu step in G20 Summit
ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ సినిమాలోని హీరోలకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కింది. సినిమా తర్వాత దేశంలోని ప్రతిష్టాత్మకమైన సదస్సుల్లో పాల్గొంటూ అరుదైన గౌరవాలను దక్కించుకుంటున్నాడు రామ్ చరణ్. తాజాగా కశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతున్న 2023 G20 సదస్సుకు చరణ్ హాజరయ్యాడు. మే 22న మొదలైన ఈ సదస్సు మూడురోజుల పాటు జరగనుంది. ఈ సదస్సులో 17 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొని ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ పై చర్చలు జరపనున్నారు. ఈ సదస్సులో భారత్ తరపున రామ్ చరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఈ సమ్మిట్ లో పాల్గొన్న రామ్ చరణ్.. భారత్ లో సినిమా అభివృద్ధి, కాశ్మీర్ సినిమా రంగంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందన్న అంశాలపై మాట్లాడాడు. అనంతరం సమ్మిట్ లో పాల్గొన్న కొరియన్ అంబాసిడర్స్ తో కలిసి ఆర్ఆర్ఆర్ నుండి వరల్డ్ ఫేమస్ గా నిలిచిన నాటు నాటు సాంగ్ కి స్టెప్పులేశాడు. ఈ వీడియోను ఎంబసీ ప్రతినిధులు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది నెట్టింట వైరల్ గా మారింది. కాగా.. కశ్మీర్ లో రాష్ట్ర హోదాను తొలగించిన అనంతరం జరుగుతున్న తొలి అంతర్జాతీయ సదస్సు కావడంతో.. G20 సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది.