పేదలకు గుడ్ న్యూస్... ఒకే సారి మూడు నెలల రేషన్

రేషన్ లబ్దిదారులకు కేంద్రం శుభవార్త అందించనున్నట్లు తెలుస్తోంది.

Update: 2026-03-21 12:31 GMT

రేషన్ లబ్దిదారులకు కేంద్రం శుభవార్త అందించనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పేదలకు బియ్యం సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సారి ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఉచిత రేషన్ ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

గోదాముల్లో ఆహార నిల్వలు...
ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ మార్చి నెలాఖరులోపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎండల తీవ్రతతో పాటు గోదాముల్లో ధాన్యం నిల్వలు అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News