నేడు కూడా ఈడీ ఎదుటకు రాహుల్

ఈరోజు కూడా రాహుల్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

Update: 2022-06-14 02:52 GMT

నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అధికారులు నిన్న పది గంటల సేపు విచారించారు. ఈరోజు కూడా రాహుల్ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. నిన్న మధ్యాహ్నం ఈడీ ఆఫీసుకు వెళ్లిన రాహుల్ గాంధీ రాత్రి 11 గంటలకు బయటకు వచ్చారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విదేశీ బ్యాంక్ ఖాతాలు, ఆస్తులపై రాహుల్ ను ప్రశ్నించినట్లు తెలిసింది. దాదాపు యాభైకి పైగానే ప్రశ్నలు అడిగినట్లు చెబుతున్నారు.

తెలంగాణలో దీక్షలు...
ఈరోజు మరోసారి హాజరుకావాలని రాహుల్ గాంధీని ఈడీ అధికారులు ఆదేశించారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఈడీ కార్యాలయం ఎదుట దీక్షను చేపట్టనున్నారు. రాహుల్ ను మళ్లీ విచారణకు పిలిచినందుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సహా నేతలందరూ ఈడీ ఆఫీసు ఎదుట సత్యాగ్రహ దీక్షకుదిగనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో దీక్షలు చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీ కుటుంబంపైకి బీజేపీ ఈడీని ఉసిగొల్పుతుందని ఆరోపిస్తున్నారు.


Tags:    

Similar News