ప్రధాని మోదీ సోదరుడికి తీవ్ర గాయాలు

ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీకి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కర్ణాటకలోని మైసూరు వద్ద ప్రమాదం జరిగింది

Update: 2022-12-27 11:40 GMT

ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీకి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కర్ణాటకలోని మైసూరులోని ప్రహ్లాద్ మోదీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీకి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

చికిత్స నిమిత్తం...
ప్రహ్లాద్ మోదీకి తీవ్రగాయాలవ్వడంతో బీజేపీ నేతలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీ కుటుంబ సభ్యులకు కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. కారును క్రేన్ ద్వారా పోలీసులు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News