Narendra Modi : నేడు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన
నేడు, రేపు మూడు రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు
నేడు, రేపు మూడు రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. బిహార్‌లో దాదాపు 5736 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం ఒడిశాలో పర్యటించనున్న ప్రధాని మోదీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒడిశాలో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తికావడంతో అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
సాయంత్రం విశాఖకు...
సాయంత్రం 6.45 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆంద్రప్రదేశ్ లోని విశాఖపట్నానికి చేరుకుంటారు. అక్కడ ఐఎన్ఎస్ డేగా వైమానిక స్థావరానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, గవర్నర్ తో పాటటు ఎంపీలు స్వాగతం పలకనున్నారు. హెహల్గాం దాడిలో మరణించిన చంద్రమౌళి భార్యను ప్రధాని కలిసే అవకాశం ఉంది. రాత్రికి విశాఖలోనే బస చేసి రేపు ఆర్కే బీచ్ లో జరిగే యోగా డే వేడుకలలో పాల్గొంటారు.