Narendra Modi: నేడు కూడా గుజరాత్ లో ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు కూడా గుజరాత్ లో పర్యటించనున్నారు

Update: 2025-05-27 04:27 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు కూడా గుజరాత్ లో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న గుజరాత్ కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపారు. మెట్రో రైలును నడిపారు. అదే సమయంలో యాభై నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన లోకో మోటివ్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.

రెండో రోజు కూడా...
నేడు కూడా రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లో పర్యటించనున్నారు. నేడు గుజరాత్ పట్టణ ప్రగతి పథం వేడుకలను మోదీ ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్దిదారులకు ఇంటికి సంబంధించిన పత్రాలను అందచేయనున్నారు. అలాగే స్థానిక సంస్థలకు ప్రధాని నరేంద్ర మోదీ 3,300 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయనున్నారు.


Tags:    

Similar News