Narendra Modi : నేటి నుంచి గుజరాత్ లో రెండు రోజులు పర్యటించనున్న ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుజరాత్ లో పర్యటించనున్నారు.

Update: 2025-05-26 04:36 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుజరాత్ లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు గుజరాత్ లోనే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు, రేపు గాంధీనగర్, కచ్, దాహోద్ జిల్లాల్లో పర్యటించి వేల కోల్ట రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

పలు ప్రాజెక్టుల ప్రారంభం...
మోదీ దాహోద్ లో దేశంలో తొలిసారి 9000 హెచ్.పి. లోకోమోటివ్ ఇంజిన్ ను జాతికి అంకితం చేయనున్నారు. ఇరవై వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అనంతరం భుజ్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. తర్వాత గాంధీనగర్ లో గుజరాత్ పట్టణ ప్రగతిని సందర్శించే కార్యక్రమంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారులు, నేతుల భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News