Narendra Modi : నేడు బెంగళూరుకు ప్రధాని మోదీ

నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలోని బెంగళూరులో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు

Update: 2025-08-10 02:08 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో పర్యటించనున్నారు. కర్ణాటకలోని బెంగళూరులో ఆయన పర్యటన కొనసాగనుంది. బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం మోదీ బెంగళూరు మెట్రో ఫేజ్-3కి శంకుస్థాపన చేయనున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. బెంగళూరులో ట్రాఫిక్ సమస్య పెరిగిన నేపథ్యంలో మెట్రో విస్తరణ పనులు చేపట్టనున్నారు.

వందే భారత్ రైళ్లను...
తర్వాత బెంగుళూరు నుంచి మూడు వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని అధికారులతో సమావేశమయ్యే అవకాశముందని తెలిసింది. దీంతో పాటు కర్ణాటక బీజేపీ ముఖ్య నేతలతో కూడా సమావేశమవుతారని చెబుతున్నారు. ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.


Tags:    

Similar News