Narendra Modi : నేడు ఢిల్లీలో మోదీ ప్రారంభోత్సవాలు

నేడు ఢిల్లీలో రెండు ప్రధాన జాతీయ రహదారులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు

Update: 2025-08-17 04:48 GMT

నేడు ఢిల్లీలో రెండు ప్రధాన జాతీయ రహదారులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మొత్తం పదకొండు వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రహదారులను నేడు జాతికి అంకితం చేయనున్నారు. అర్బన్‌ రోడ్లు ఫేజ్‌-2, ద్వారక ఎక్స్‌ప్రెస్‌వే, ఢిల్లీ శివారు ప్రాంతాలను అనుసంధానిస్తూ కారిడార్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

జాతీయ రహదారులు...
ద్వారక ఎక్స్‌ప్రెస్‌వేతో నోయిడా నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు దూరం తగ్గనుంది. రహదారుల ప్రారంభోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని పర్యటించే ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీ ప్రజలకు అనుకూలంగా ఉండేలా, అలాగే పర్యాటకులకు వీలు కలిగేలా, సత్వర ప్రయాణానికి ఈ రహదారులను నిర్మించారు.



Tags:    

Similar News