Narendra Modi : నేడు రెండో రోజు గుజరాత్ లో మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుజరాత్ లో రెండో రోజు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు
ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుజరాత్ లో రెండో రోజు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. దాదాపు 5,400 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు, పనులకు శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలు మోదీ చేయనున్నారు. నిన్న అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి పార్టీ నేతలు, అధికారులు భారీగా స్వాగతం పలికారు.
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో...
నేడు కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా గుజరాత్ లో భారీ బందోబస్తు ఏర్పాటుు చేశారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గం వైపు వెళ్లాలని సూచించారు. భారీగా ప్రధాని మోదీ కార్యక్రమానికి అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. ఈరోజు ఆయన తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు.